2057
తెలుగు రచన
12/07/2022
===============
రామ రామరాజ్యంలో
రాసేందుకు పలక లేదు
రాయించే పంతుల్లకు
రమా రమీ కూడు లేదు
ఇంత కాదు అంతనీ
ఇంగిలీసు బడులు పెట్టి
ఇంటింటా తిరిగి తిరిగి
ఇంత మంది నీడ దెచ్చి
ఇరిగి పడే గోడల్లో
ఇరికించిన పంతుళ్ళ
ఇబ్బందులు ఇన్ని కాదు
సిబ్బందికి దిక్కులేదు
ఊరూరా పాఠశాల
ఉండ పైన కప్పు లేదు
వండి పెట్టు దిక్కులేదు
వండ నింత పిండి లేదు
రాయించే దిక్కు లేదు
రాయనొక్క బుక్కు లేదు
పంతుళ్లకు బుక్తి లేదు
బత్తేలకు సొత్తు లేదు
పదవి కొరకు ప్రాకులాట
ప్రజల బ్రతుకు దేవుడెరుక
ఎదుగు నేర్వ లేని వీళ్ళు
ఇదా చేసినేర్పాటు?
===============
య.వెంకటరమణ/..
No comments:
Post a Comment