2057
తెలుగు రచన
17/07/2022
=======================
ఇడ్లీ ధరలు తగ్గించమంటే
సాంబారు ధర పెంచిన వైనాలు
కాన్వెంట్ చదువుల ఫీజులల్పము
అదనంగా అన్నీ ఘనము
చొక్కా లాగూ ముప్పై వందలు
ఎక్కాల బొక్కు ఎనభై తొంబై
వేలకు వేలు ఎంట్రీ ఫీజులు
ఎగ్జాము ఫీజులవి ఇంకో లెక్కలు
స్పెల్లింగులెరుగరు ప్రాజెక్ట్ వర్కులు
బట్టీ బట్టిన లెక్కలు బోలెడు
పేదలకందని ప్రయివేటు చదువులు
చదువుల్లేని ప్రభుత్వ బడులు
అర్హత లేదని అనుమతి రద్దు
అక్కడక్కడా ప్రయివేటు బడులు
సరకారోళ్ళకు సలాము భాయి
చలాకి మంత్రం చదువుల చట్టం
బడిలో ఉండవు పాఠ్య పుస్తకములు
బయట షాపులో గుట్టలు గుట్టలు
నీళ్లను కాచే కొబ్బరి చెట్టుకు
నీటి దాహమా ఇదేమి చిత్రం
=======================
య.వెంకటరమణ/..
No comments:
Post a Comment