2058
తెలుగు రచన
22/07/2022
===================
విలతాండవం మొదలయ్యింది
అడ్డుకొనంగా కొండల్లేవు
ఆకలి తీర్చే చెట్లూ లేవు
ఆకలి బాధలు అంగలార్పులు
చీకటిమయమై చెమరిన కళ్ళు
భూ భ్రమణంలో పూరి పాకలు
ఆకలి తీరని బడుగు ప్రాణులు
ప్రగతిపథంలో ప్రజాతంత్రము
అంకిన కాడికి బొక్కే జనము
వరదలు వస్తే వారధి వేస్తాం
రోగలోస్తే మందులు చేస్తాం
బక్క చిక్కిన బరోస మంత్రం
చచ్చి బ్రతుకుతూ ప్రజా తంత్రము
దోపిడి గాళ్ళకు పెద్ద ఆసనం
దోసిన దంతా రద్దు చేయడం
పెద్ద దొంగలకు పరుపుల చారము
తప్పుడుగాళ్ళ అప్పులొదలడం
ఇంతేనా ఇక ఇంతేనా గతి గాచ్చారం ఇంతేనా
వంతులు మారుతు భ్రష్టాచారం
నీతి చచ్చిన జనాల ఘోరం
నిన్నో మొన్నో ఇంకో కదనం
నగరం మధ్యన నియంత ఘోరం
వేసిన కంచే చేనును మేస్తే
పంటకు రక్షణ ఎక్కడ నేస్తం
ఇలాగ సాగితె ఈ వైషమ్యం
ఇంకొచ్చేది నిప్పుల వర్షం
ఇలాగ సాగితె ఈ వైషమ్యం
ఇంకొచ్చేది నిప్పుల వర్షం
===================
య. వెంకటరమణ/..
No comments:
Post a Comment