Nayaa's Kitchen Product Post

Spicy Gongura Pickle

Product Highlights:

  • Made with fresh, hand-picked Gongura leaves.
  • Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
  • Zero artificial preservatives or coloring agents.
  • Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
  • Sealed for freshness - enjoy the flavor for months!
×

Confirm Your Delivery Details

Saturday, August 13, 2022

❓ ఇంతకీ నేనెవరు? ❓

 


2060
తెలుగు రచన
25/07/2022
====================
అలసిపోయా నే సొలసిపోయా
మనిషినై నే సమసిపోయా
జీవమున్నా శవము నేనై
జనములో నే కలిసిపోయా
మానవత్వం కానకాయ్యో
మనిషి ఉనికిని కోలుపోతిని
మ్రానునైనా కాకపోతిని
మనిషినై నే మోసపోతిని
బ్రతకడానికి బత్తెమడిగితె
బ్రతికి ఉన్నా సాక్షమడిగిరి
కాటికన్నా పంపమంటే
కాసులిమ్మని బేరమాడిరి
దగాకోరుల కుటిల నీతికి
దమన జీవుల దగా ధాటికి
దనుజు శాస్త్రం పుటల వేటుకి
దమనుడై నే దహనమైతిని
మేఘమై నే నురమలేను
పిడుగునై నే కురియలేను
నీటనయినా మునగలేను
గాలిలోనే నెగురలేను
అగ్గినయ్యే మత్రముంటే
దగ్ధమయినా చేసిపోదును
దుష్ట జీవుల తుడిచిపెట్టే
వరదనై నే వచ్చిపోదును
ఈతి బాధలు మూటగట్టి
ఇచ్చటనైనా బ్రతుకనొచ్చిన
సాటి మనిషిని నేను కూడా
ప్రాణముంటే నేడు కూడా..
===================
య.వెంకటరమణ/..

No comments:

Post a Comment