◆◆◆◆◆◆◆◆◆◆◆◆
వసంతంలో ఓ సందె వేళ
అందంగా వంగిన ఆ కొమ్మ
మృదువైన లేలేత చిగురులతో
నా చెంపలు నిమురుతూ
వేసవిలో నువ్ పోసిన నీటి పుణ్యమే
నేడు నేను చిగురులు తోడుగానిలా
ఈ శక్తినంతా కూడ గట్టి నేను
నీ శక్తికి ఫలములు చేకూరుస్తున్నా
నా జీవితమే నీ కంకితమిస్తున్నా
నా ఛాయాలో నీ సేద దీరుస్తా
నీవిచ్చిన ఈ అడుగుడు నేలే చాలును
నీకు అడ్డురాని గాలిలో నేనుంటాను
నా ఆకులు తిని నే బ్రతికేస్తాను
మండుటెండలో ఎండైనా నేను
ఎండగాస్తు నీడుంటా నీ కోసం
అందరూ నన్నే చూస్తున్నారు
నా నడుముకు లెక్కలు వేస్తున్నారు
అదిగో గొడ్డలి పదునెడుతున్నారు
ఆదుకో నా నేస్తం, ఆదరించు నేస్తం
ఎటూ వెళ్లలేను, ఏమీ అన లేను
ఎదురు తిరగలేను, ఏడ్వనైనా లేను
చేతులు జోడించాలన్నా,అవిలేవే నాకు
ఆదుకో నేస్తం, ఆపు కాస్త నేస్తం
◆◆◆◆◆◆◆◆◆◆◆◆
తెలుగు రచన... ✍
No comments:
Post a Comment