Nayaa's Kitchen Product Post

Spicy Gongura Pickle

Product Highlights:

  • Made with fresh, hand-picked Gongura leaves.
  • Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
  • Zero artificial preservatives or coloring agents.
  • Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
  • Sealed for freshness - enjoy the flavor for months!
×

Confirm Your Delivery Details

Thursday, May 5, 2022

2063

2063
Telugu rachana
04/05/2022
=============================
రెక్కలు తెగినా శాంతి కపోతాం ఎక్కడనో పాపం
రక్తపు మడుగుల గుక్కతిరగని ఇది మన స్వాతంత్య్రం
ముప్పాతికలో ఇప్పటికింకా పాపే నా దేశం
బిక్షమెత్తెడి అన్నదాతల సుభిక్ష సామ్రాజ్యం

మద్యం మత్తున ఊగుతూ జోగుతు మతిమాలీజనము
మతాల పేరిట మారణహోమం మారములే మనము
పెత్తనదారుల తంతేయంత మనమే బానిసలం
పిల్లి తగవులు తీర్చనొచ్చిన కోతులదీ రాజ్యం
 
చెప్పులరిగినా చేతికందని  న్యాయం మన తంత్రం
రెక్కలాడినా డొక్కలాడదు ఇది మన సౌభాగ్యం
ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు ఏదీ లౌకికము
ముద్దకు నోచని మురికివాడలు ఆకలిపోరాటం

చెప్పుకుపోతే చరిత్ర మొత్తం ఒకరికి దాసోహం
రక్తపు మడుగుల గుక్కతిరగని ఇది మన స్వాతంత్య్రం
ఇంకా ఇంకా, ఇంకా ఇంకా , ఇంకా ఎన్నాళ్ళో
ఇంకిన కళ్ళకు ఏడుపు మంత్రం ఇంకా ఎన్నాళ్ళో

రెక్కలు తెగినా శాంతి కపోతాం ఎక్కడనో పాపం
=============================
                   య.వెంకటరమణ/..

No comments:

Post a Comment