Nayaa's Kitchen Product Post

Spicy Gongura Pickle

Product Highlights:

  • Made with fresh, hand-picked Gongura leaves.
  • Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
  • Zero artificial preservatives or coloring agents.
  • Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
  • Sealed for freshness - enjoy the flavor for months!
×

Confirm Your Delivery Details

Sunday, March 13, 2022

2054

2054

తెలుగు రచన
12/03/2022
====================
కనురెప్పలు వాలిపోతాయి
కనుబొమ్మలు రాలిపోతాయి
వాడిపోతాయి మారిపోతాయి
కొత్త ఆశలు చిగురులేస్తాయి

కొత్త ఆశలు చిగురులేస్తాయి
ఆశలన్నవి మొలకదీస్తాయి
చిగురు తొడిగి చిలవ పలవలు
నింగి వైపుకు దారితీస్తాయి

చిగురు తొడిగి చిలవ పలవలు
నింగి వైపుకు దారితీసేను
నిన్నలాగే నేడు కూడా  
కలలు కంటికి మిగులిపోయేను

ఎంత వాడీ అలఁతి ప్రాణి
ఎంతకెంతకు ఎంత ఎదిగేను
చూపు కంటే దూరమేగెను
నేలనొదలి నింగికెగసేను

నీటినార్పే నిప్పునే మరి
నిప్పుగా  ఈ మనిషి మార్చేను
నిప్పు లాంటి సత్య మొకటి
ఎప్పుడూ ఈ మనిషి మరిచేను

తృప్తి లేని తత్పరుండు 
తపనలోనే తనువునిడిచేను
తనది మొత్తం తవిషనిడిచి
రిక్తహస్తుడు  పరముకేగేను 
==================
         య.వెంకటరమణ/..

No comments:

Post a Comment