Nayaa's Kitchen Product Post

Spicy Gongura Pickle

Product Highlights:

  • Made with fresh, hand-picked Gongura leaves.
  • Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
  • Zero artificial preservatives or coloring agents.
  • Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
  • Sealed for freshness - enjoy the flavor for months!
×

Confirm Your Delivery Details

Sunday, March 6, 2022

2011

2011
Telugu Rachana
21/01/2021
===================
ఎవరు కట్టిన గోడలో ఇవి
ఎవరు వేసిన పునాదులో
శక్తిశాలే పర్వతాలను
పగలగొట్టి కట్టినారో
అంతకంతకు పెరిగిపో యే
వింత రాళ్ళను పేర్చినారో
ఇంత పెరిగిన అంకణాలు
కోటగట్టిన కోటి తెగలు
తెగని తగువుల తెగలడేరు
తెగల వారీ మతం వేరు
మానవత్వం పునాధుల్లో
మనగద్రొక్కిన మనిషి తీరు
బ్రతుకు మార్గపు వర్ణభేదం
బడలి చావుకు దారి తీస్తే
బదల రానీ పరాత్పరుడు
మదనపడుట మహత్తరమా
మనసు తలుపులు తెరిచి చూడు
అంతరాత్మకు ఒదిగి బ్రతుకు
ఊరకే ఈ తగవులెందుకు
కులంమీదా మతం మీదా
కులం మీదా..? మతం మీదా..?
మనది మనమే మతం కాదా
కలిసి బ్రతికే మార్గమెంచు
కడకు బ్రతుకే స్వర్గమనుచూ
===================
య. వెంకటరమణ

No comments:

Post a Comment