Nayaa's Kitchen Product Post

Spicy Gongura Pickle

Product Highlights:

  • Made with fresh, hand-picked Gongura leaves.
  • Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
  • Zero artificial preservatives or coloring agents.
  • Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
  • Sealed for freshness - enjoy the flavor for months!
×

Confirm Your Delivery Details

Friday, July 5, 2019

చివరి కవిత

***********  చివరి కవిత **********
========================
చివరి కవిత నేను వ్రాయనా
చివరికిదే చివరి  కథౌనా
చివరి  కవిత  ఇదే ఇదౌనా
చివరి పాట నేను  పాడనా

నా రచనే  నాకు ప్రాణము
ఈ రచనే చివరి వచనము
కారుమబ్బుల చీకటిలో
కనుమరుగూ  తారల్లో
ఒక తార నేను అవుతాను
జేర  నిన్ను జూస్తాను

అనురాగం  ఎలా పంచను
ఈ రాగం ఎలా పాడను
ప్రేమెరుగని పాషాణం
పాశమై వెంటాడితె
చివరి పాట  ఇలా పాడనా
చివరి పాట నేను  పాడనా

స్వరం లేని  చివరి పాట
శ్వాస లేని  ఈల  పాట
ఎలా  నీకు చేరవేయను
ఆ చేరువెలా నేను మరువను
కారుమబ్బు  చీకటిలో నేనుమనగలేను
కన్నీటిసాగరాలు నేను ఈదలేను

చివరి కవిత నేను వ్రాయనా
చివరికిదే చివరి  కథౌనా
చివరి  కవిత  ఇదే ఇదౌనా
చివరి పాట నేను  పాడనా
=========================

No comments:

Post a Comment