Nayaa's Kitchen Product Post

Spicy Gongura Pickle

Product Highlights:

  • Made with fresh, hand-picked Gongura leaves.
  • Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
  • Zero artificial preservatives or coloring agents.
  • Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
  • Sealed for freshness - enjoy the flavor for months!
×

Confirm Your Delivery Details

Friday, July 5, 2019

చిట్టి పొట్టి పిల్లలం బుల్లి బుల్లి మొగ్గలం

చిట్టి పొట్టి పిల్లలం బుల్లి బుల్లి మొగ్గలం
లేవు మాకు ఎల్లలు చిల్లి బిల్లి ఆటలు
అన్నా చెల్లీ అందరం ఆడి పాడుచుందుము
అక్ష రాలు నేర్చి మేము మంచి పేరు తెద్దుము
            !!చిట్టి పొట్టి పిల్లలం!!

అమ్మా నాన్నా గురువు వారు మాకు దైవం
పెద్ద లంటే గౌరవం బుద్దిగా నుందుము
దేశమంటే మాకు అంతులేని ప్రేమ
జెండా వందనంతో ముందు కెళ్ళ తాము
            !!చిట్టి పొట్టి పిల్లలం!!

బుల్లి బుల్లి పాటలు బోలెడన్ని వచ్చు
తాత మామ్మ కథలు చాలా చాలా తెలుసు
టీచరమ్మ  లెక్కలు అయ్యంగారి ప్రశ్నలు
చకా చకా చెప్పిమేము చక్కగా ఆడతాం
              !!చిట్టి పొట్టి పిల్లలం!!

బోసి నవ్వు బాపూజీ వీరు డైన నేతాజీ
వీరు మాకు ఆదర్శం వారి పేరు నిలబెడతాం
అంత కంత చదివి అంతటోళ్ల మవుతాం
అమ్మ నాన్న పేరు అంత పైన ఉంచుతాం
            !!చిట్టి పొట్టి పిల్లలం!!

No comments:

Post a Comment