1710
తెలుగు రచన
11/02/2018 09:48
==============================
ఎంత కాలం మ్రానునై ఈ అడవి నుండాలి
ఎంత కాలం మొక్కనై ఈ తోట మిగలాలి
జడలు బోసిన ఊడలెప్పుడు తెంచుకోవాలి
అల్లుకున్నా వేరులెప్పుడు
వదిలి నడవాలి
పంక్తులందలి పర్వతంలా ఎంతకాలం ఇలా ఉండాలి
చలనమెరుగని రాయిలా నేనెంతకాలం ఉండి పోవాలి
దుక్క ఇనుముకు సాన బట్టే యంత్రమొక్కటి నాకు కావాలి
కటిక చీకటి పారద్రోలే ప్రమిద నొక్కటి నేను బెట్టాలి
ప్రమిద ప్రసరపు వెలుగు నేనై విస్తరించాలి
కలలకళ్ళకు నిద్రబట్టని గేయమొక్కటి నేను వ్రాయాలి
నేను వ్రాయాలి, కవితనొక్కటి నేను వ్రాయాలి
కలం దాటా అక్షరాలకు ప్రాణమొచ్చో పాటకావాలి
కనులు దాటీ కలలు ఎప్పుడు నిజంగావాలి నిజంగావాలి
===============================
౼యలమంచిలి వెంకటరమణ
Nayaa's Kitchen Product Post
!doctype>
Spicy Gongura Pickle
Product Highlights:
- Made with fresh, hand-picked Gongura leaves.
- Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
- Zero artificial preservatives or coloring agents.
- Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
- Sealed for freshness - enjoy the flavor for months!
Monday, March 26, 2018
ఎంత కాలం మ్రానునై ఈ అడవి నుండాలి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment