Nayaa's Kitchen Product Post

Spicy Gongura Pickle

Product Highlights:

  • Made with fresh, hand-picked Gongura leaves.
  • Authentic Andhra style recipe, perfect blend of sour and spice.
  • Zero artificial preservatives or coloring agents.
  • Pairs perfectly with hot rice, idly, dosa, and chapathi.
  • Sealed for freshness - enjoy the flavor for months!
×

Confirm Your Delivery Details

Monday, March 26, 2018

ఎంత గుమికమీ నేల

పల్లవి:
ఎంత గుమకమీ...నేల కుసుమాలా ఈ..మాలా..
ప్రవహించే ఈ నదులా పరుగుల్లా  ఈ...లీలా
ఎంత గుమకమీ...నేల కుసుమాలా ఈ..మాలా..
ప్రవహించే ఈ నదులా పరుగుల్లా  ఈ...లీలా

చరణం:
ఏలనీనేలా.., ఏ ఋషుల వరమాలా....
యిలజారి పడెనేమో.........
స్వర్గ ముకుటమిదియేమో..
ఇదియేమో స్వర్గపీటమిదియేమో....
ఎంత గుమకమీ...నేల కుసుమాలా ఈ..మాలా..
......... ఎంత గుమకమీ!!

చరణం
ఈనెమలీ నాట్యాలూ,ఆ పంచీగానాలూ..
పవనాలు, కుసుమాలు ఈ ఆకశాన హరివిల్లూ..
చలచల్లగ వీచుగాలి ఎగసిపడే కెరటాలూ...
ఎంత గుమకమీ...నేల కుసుమాలా ఈ..మాలా..
...........ఎంత గుమకమీ!!

చరణం:
జాలువారు యేటినీరు గాలిపాటలూ
విరబూసిన పూదోటలు విరివీ..ఫలాలూ....
మల్లెల పరిమళాలు మురిపాల వెన్నియలూ...
ఎంత గుమకమీ...నేల కుసుమాలా ఈ..మాలా..
...........ఎంత గుమకమీ!!

చరణం:
మదినితాకు పిల్లగాలి అల్లరివేషాలు..
చెల్లని మబ్బుతెరల వడివడి పయనాలూ.  
ఏరువాక అలల పరుగులూ..ఎదిరీదే చిట్టిచేపలూ...
ఎంత గుమకమీ...నేల కుసుమాలా ఈ..మాలా..
...........ఎంత గుమకమీ!!
============================
.......యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment